జిల్లాలో బాలల రక్షణ, సంరక్షణ కోసం అధికారులు సమన్వయంతో పని చేయడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు . సోమవారం చైల్డ్ లైన్ 1098 అధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయయంలో బాలల హక్కులకు మద్దతుగా గోడపత్రిక ఆవిష్కరించి ,సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన, అక్రమ దత్తతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కోవిడ్ బాధిత బాలలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. పాఠశాలలో, కళాశాలలో కోవిడ్ నిబంధనలు పాటించలని అన్నారు. డ్రాపౌట్స్ విద్యార్థులను వెంటనే బడులలో చేర్పించాలని అన్నారు.
అనంతరం దోమ మండలం, పాలేపల్లి గ్రామానికి చెందిన కటిక ఖాజా పాషా అనే శరీరక దివ్యాంగునికి తన అభ్యర్తన మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ట్రై సైకిల్ ను జిల్లా కలెక్టర్ అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య ,జిల్లా ఎస్ సి , ఎస్ టి ,బిసి సంక్షేమ అధికారులు మల్లేశం, కొటాజి, పుష్పలత, చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ,కౌన్సిలర్ రామేశ్వర్ సభ్యులు యాదయ్య ,రాములు, తదితరులు పాల్గొన్నారు