బాలల స్నేహపూరిత జిల్లాగా మన భద్రాద్రి జిల్లాను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 

మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో  బాలల హాక్కుల వారోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను ఎప్పుడూ గౌరవిస్తూ వారిని  కాపాడాలని చెప్పారు. బాలల అందరూ బడిలొనే ఉండాలని  బాల కార్మికులుగా మారకూడదని, బాల్యవివాహాలు జరగకుండా, బాలలపై వేధింపులు లేకుండా  బాలల హక్కుల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు.   పిల్లలకు ఏదైనా ఆపదవస్తే బాలల నేస్తం 1098 ఫోన్ చేయుట గురించి  అందరికి అవగాహన కల్పించాలని చెప్పారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను  “బాలల స్నేహపూరిత జిల్లా” గా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ  శాఖ అధికారి శ్రీమతి షబాన, జిల్లా సంక్షేమ సమితి సభ్యులు  అంబేద్కర్,  షాదిక్, శ్రీమతి సుమిత్ర దేవి, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీమతి హరి కుమారి, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్  రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post