బాలల హక్కుల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలి. సంక్షేమ గురుకుల, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆహ్లదకరంగా, నందనవనంల ఉండాలి. ప్రతి సంక్షేమ గురుకుల, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్1098 బోర్డు ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్ 22:
బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బాలలు జాతీయ సంపదని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులకు భంగం కలుగకుండా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, న్యాయ చట్టం 2005 ఉన్నదని, చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు వారి హక్కులకు భంగం కలుగకుండా కృషి చేయాలని అన్నారు. బాలల రక్షణ, సంరక్షణ విభాగాలు బాలల హక్కులపై ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి బాలల స్నేహ పూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. పిల్లలను అర్థం చేసుకుంటు వారి అవసరాలను అంచనా వేయాలని ఆయన తెలిపారు. బాలల భద్రతను కాపాడటానికి బాలల హక్కులు, చట్టాల పట్ల చైతన్యం కల్పించి, పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయాలని ఆయన అన్నారు. పిల్లలలో జీవితం పట్ల భరోసా కల్పించాలన్నారు. వేడుకల్లో పాల్గొన్న కొడకండ్ల, చౌడారం కెజివిబి పిల్లలతో పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా, పాఠశాలలో ఏది నచ్చకపోయినా చైల్డ్ లైన్ 1098 కి కాల్ చేయాలని ఇది మీ కోసం ప్రత్యేకంగా స్థాపించబడిందని కలెక్టర్ పిల్లలకి తెలియజేసారు. సమాజంలో ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని మారుతున్న కాలానుగుణంగా అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించి బావి తరాలకు మార్గద్శకులుగా పిల్లలును తీర్చిదిద్దాలన్నారు. అలాగే సంక్షేమ గురుకుల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యo ప్రతి పాఠశాలలో పిల్లలకి నచ్చే విదంగా తీర్చిదిద్దాలని పూల, పండ్ల మెక్కలు నాటించాలని, పాఠశాల ఆవరణ ఆహ్లదకరంగా, నందనవనంలా ఉండాలని ఆయన అన్నారు. ప్రతి పిల్లవానికి అవసరమైనచో చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసే విదంగా ఫోన్ సౌకర్యం కల్పించాలని, చైల్డ్ లైన్ 1098 నెంబర్ పిల్లలకి కనపడేలా బోర్డు పెట్టించాలని సూచించారు. బాలల నేస్తం టోల్ ఫ్రీ నంబర్ చైల్డ్ లైన్ 1098 నంబర్ ని బాలలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, క్రీడా, తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు ప్రశంసా పత్రము, మేమొంటో ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా వేల్ఫేర్ అధికారిణి జయంతి, జడ్పీ సీఈఓ ఎల్. విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్ పర్సన్ ఉప్పలయ్య, సభ్యులు, కవిత, శ్రీలత, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఇక్బాల్ పాషా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, సిబ్బంది పాషా, సంపత్, డీసీపీయూ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, కెజివిబి చిల్డ్రన్ హోమ్ ఇంచార్జి, పాఠశాల ఉపాద్యాయులు, బాలికలు పాల్గొన్నారు.

Share This Post