బాలల హక్కుల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలి – సంక్షేమ గురుకుల పాతాశాలలో ప్రవేశాలకు కల్పిస్తామని హామీ – బాధిత కుటంబాలు ధైర్యంగా ఉండాలని పిలుపు – మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిరాశ్రయులైన పిల్లలను గుర్తించాలి – – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు,
బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బాలలు జాతీయ సంపదని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిపై, స్వచ్ఛంద సంస్థలపై ఉందని అన్నారు, 18 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులకు భంగం కలుగకుండా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ,మరియు న్యాయ చట్టం 2005 ఉన్నదని,చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు వారి హక్కులను భంగం కలుగకుండా కృషి చేయాలని అన్నారు,
బాలల రక్షణ సంరక్షణ విభాగాలు బాలల హక్కులపై ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి, బాలల స్నేహ పూర్వక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు,
ముఖ్యంగా కోవిడ్ కాలంలో పది కుటుంబాల పిల్లలు నిరాశ్రయలయ్యారని, 406 మంది పిల్లలు సెమీ ఆర్ఫన్ గా గుర్తించి వారికి నిత్యావసరాలను పంపిణీ చేశామని, అయితే ఇంకా నిరాశ్రయులు, సెమీ ఆర్ఫన్ పిల్లలను గుర్తించుటలో అంగన్వాడి టీచర్లు, ఐ సి డి ఎస్ సూపర్ వైజర్లు, సిడిపిఓ లు బాలల పరిరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వారికి తగు అవసరాలను సమకూర్చాలని, గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఫీజులు కట్టలేని పరిస్థితి లో ఉన్న పిల్లలకు సంబంధిత పాఠశాల యాజమాన్యం వారు ఉచిత విద్య అందించేందుకు జిల్లా విద్యా శాఖాధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు, సంక్షేమ జీ వో ఎం ఎస్ నంబర్ 47 ప్రకారం వారికి 3 శాతం రిజర్వేషన్ వర్తించేలా గురుకులాల కార్యదర్శులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని ఎవరెవరికి విద్యా వైద్య సహకారం అందించుటకు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ బాలల న్యాయ చట్టం, బాల రక్షా భవన్ అధికారులు బాల్య వివాహ నిషేధ చట్టం, అక్రమ రవాణా చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం, పొక్సో చట్టం పై విస్తృత అవగాహన కల్పించి సమాజ మార్పుకు కృషి చేస్తున్నారని,
బాల రక్షా భవన్ బాలలకు రక్షణ సంరక్షణ కల్పంచుటలో వన్ స్టాప్ కేంద్రంగా పని చేస్తుందని,భవిష్యత్ లో మరిన్ని సేవలు అందించి బాలల రక్షణ సంరక్షణ కోసం కృషి చేయాలని ఆశా భావం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిరంతరంగా పనిచేస్తుందని, అధికారుల సమన్వయంతో బాలల సంరక్షణ కేంద్రాలలోని పిల్లల పర్యవేక్షణ, కనీస ప్రమాణాలు పాటించే విధంగా తగు చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు సంసిద్దులై ఉన్నామని అన్నారు,
జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత మాట్లాడుతూ బాలల నేస్తం టోల్ ఫ్రీ నంబర్ చైల్డ్ లైన్ 1098 నంబర్ వినియోగించుకొని తద్వారా వచ్చిన సమస్యల పరిష్కారాలు బాలల సంక్షేమ సమితి వారు చూస్తునారని,బాలల సంక్షేమ సమితి వారు తీసుకున్న నిర్ణయం మేరకు బాలలకు రక్షణ సంరక్షణ అందిస్తున్నారని అన్నారు,
గ్రామ, మండల, డివిజన్,జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయడం వలన బాల్య వివాహాలు,అక్రమ దత్తత, తగ్గుముఖం పట్టిందని అన్నారు, కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యాకూబ్ పాషా,
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, కే దామోదర్, పి హైమావతి, సి డి పి ఓ లు కే మధురిమ,ఎం విశ్వజ, సౌందర్య,ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్,ఎల్సిపివో ఏ సతీష్ కుమార్, బాలల న్యాయ మండలి సభ్యులు డాక్టర్ గోపికా రాణి, మెరుగు సుభాష్ ,
చైల్డ్ లైన్ నోడల్ ఆర్డినేటర్ ఎం డి ఇక్బాల్ పాషా, కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి
ఎన్ సి ఎల్ పి డైరెక్టర్ బుర్ర అశోక్, సూపర్ వైజర్ లు వి రాజ్య లక్ష్మి, సోషల్ వర్కర్ జీ సునీత,ఎం సుజాత దేవి,పి విజయ్ కుమార్, బి,జ్ఞానేశ్వరి, ఈ సిద్దార్థ, తదితరులు పాల్గొన్నారు,అనంతరం కోవిడ్ బాధిత కుటుంబాలకు చెందిన 60 కుటుంబాలకు నిత్యావసరాలు కలెక్టర్ చేతుల మీదుగా అందించడం జరిగినది.

Share This Post