బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరా ప్రియదర్శిని ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  బాలల హాక్కుల వారోత్సవాల గోడపత్రికలను అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను ఎప్పుడూ గౌరవిస్తూ వారిని  కాపాడాలని చెప్పారు.
బాలల అందరూ బడిలొనే ఉండాలని  బాల కార్మికులుగా మారకూడదని, బాల్యవివాహాలు జరగకుండా, బాలలపై వేధింపులు లేకుండా  బాలల హక్కుల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు.
పిల్లలకు ఏదైనా ఆపదవస్తే బాలల నేస్తం 1098 ఫోన్ చేయుట గురించి  అందరికి అవగాహన కల్పించాలని చెప్పారు.
నాగర్ కర్నూలు జిల్లాను  “బాలల స్నేహపూరిత జిల్లా” గా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు బాలల హక్కుల పరిరక్షణ పై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చైల్డ్ లైన్ సంస్థ సభ్యులు వెల్లడించారు.
సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పలువురు జిల్లా అధికారులు బ్యానర్ పై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ మధు బాబు, కోఆర్డినేటర్ మనీ, చైల్డ్ లైన్ సభ్యులు సునీత, లలిత, అరుణ, శ్రీజ, జావిద్ శ్రీనివాస్, భరత్, తదితరులు పాల్గొన్నారు

Share This Post