బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్


ప్రణాళికాబద్ధంగా బాలల హక్కుల వారోత్సవాల నిర్వహణ:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి నవంబర్ 8:- ప్రణాళికబద్ధంగా బాలల హక్కుల వారోత్సవాల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. బాలల హక్కుల వారోత్సవాల సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 7 నుంచి నవంబర్ 14 వరకు జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోనే మండలాల్లో గ్రామాల్లో, బాలల సంరక్షణ కేంద్రాలలో, కస్తూర్బా పాఠశాలలో, జూనియర్ కళాశాలలో వారి ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బాలలు ఎదుర్కొంటున్న సమస్యలైన బాల్య వివాహాలు బాలల హక్కులు, బాలల అక్రమ రవాణా, బాల కార్మికులు వంటి అంశాల పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ వారోత్సవాలో భాగంగా చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణ కోసం పిల్లలకు good touch bad touch పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు పిల్లల శారీరక ఎదుగుదలను ప్రోత్సహించే విధంగా కోకో మ్యూజికల్ చైర్ వంటి పోటీలు నిర్వహిస్తామని, పిల్లల సృజనాత్మకతకు పెంచే దిశగా మాక్ పార్లమెంట్ డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు. పౌష్టికాహారం మరియు ఆరోగ్యం పై అవగాహన కల్పించే దిశగా పిల్లలకు బాడీ మాస్ ఇండెక్స్ హెల్త్ చెకప్ ఐరన్ మాత్రలు అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పిల్లలకు వారికున్న హక్కులపై మరియు శారీరక మానసిక ఎదుగుదలపై సంపూర్ణ అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల సంరక్షించే దిశగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని సంతకం చేశారు

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ , సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post