బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారని ఈ విషయంలో వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ ,1098 వారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ యువకులకు పోటాపోటీగా ముందుకు దూసుకెళ్తున్నారని ఈ విషయంలో వారిని ప్రోత్సహించాలన్నారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువుకొని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం బాలికల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని కోరారు. బాలికలు చక్కగా చదువుకొని వారికి నచ్చిన రంగంలో ఉన్నతంగా జీవించాలని తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్ష చూపకూడదని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి కోరారు. 0 – 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు రక్షణ కోసం జాతీయ స్థాయిలో 24 గంటల పాటు నిర్వహిస్తున్న 1098 సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ఎస్ ఎస్ ప్రసాద్,, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా కో– ఆర్డినేటర్ ప్రేమ్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ విభాగం సభ్యులు భానుప్రకాష్ , సభ్యులు శ్రీకాంత్, నరేష్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post