బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…

ప్రచురణార్థం

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…

మహబూబాబాద్ అక్టోబర్ 11.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాలికలను కలెక్టర్ శాలువాతో మెమొంటో లతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు బేటి పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.
బాలికల పరిరక్షణకు కృషిచేస్తున్న కమిటీని అభినందించారు.

బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ నాగమణి మాట్లాడుతూ జిల్లాలో బాలికల అక్షరాస్యత 88% మాత్రమే అని సెకండరీ విద్యలో 52 శాతం మాత్రమే నమోదు అవుతున్నారని ఉన్నత విద్య లో 33 శాతం మాత్రమే చేరుకుంటున్నార న్నారు. అందుకు కారణం గిరిజన ప్రాంతమని బాలికల పట్ల వివక్ష మరింత ఎక్కువ అని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాలికల విద్య పట్ల కృషి చేయాలన్నారు.

అనంతరం బాలికల విద్యాభివృద్ధికి రూపొందించిన పోస్టర్లను కలక్టర్ చేత ఆవిష్కరింప జేశారు

ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ నాగ వాణి, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్ కొమరయ్య మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనిన సిడిపిఓ డేబోరా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post