బాలికల సంరక్షణ, చట్టాలపై అవగాహన కార్యక్రమం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

పత్రికా ప్రకటన.        వనపర్తి, తేది:25.05.2022.

చట్టాలు, బాలికల సంరక్షణపై అవగాహన  కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అధికారులకు ఆదేశించారు.
బుధవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో బాలికల సంరక్షణ, చట్టాలపై అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు మంచి వ్యక్తిగా ఎదిగేందుకు, మంచి ప్రవర్తన, వ్యక్తిత్వం అలవడేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, బాల కార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలను అరికట్టుట తదితర విషయాలపై చర్యలు చేపట్టాలని, బాలికలకు పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చందాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో అన్ని రంగాలలో ప్రగతి సాధించాలని ఆమె సూచించారు.
సిడబ్ల్యుసి చైర్మన్ అలివేలమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాల పై ప్రజలలో అవగాహన కల్పించాలని, తప్పిపోయిన పిల్లలను, బడి మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని, బాల కార్మిక నిర్మూలనకు కృషి చేయాలని ఆమె అన్నారు. ఆయా గ్రామాలలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు దృష్టికి వస్తే చైల్డ్ వెల్ఫేర్, సఖి కేంద్రం అధికారులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వారికి  రక్షణ కల్పిస్తూ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, బాలికల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్, DWO అధికారి పుష్పలత, డీఈఓ. రవీందర్, సిడబ్ల్యుసి చైర్మన్ అలివేలమ్మ, సి డి పి వో లు, జిల్లా అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
_______
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయబడినది.

Share This Post