బాల్యం నుండే నైపుణ్య శిక్షణపై దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ డి హరిచందన
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా బాల్యం నుండే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, జీవన విధానం, జీవన విలువలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డి. హరిచందన అన్నారు. మంగళవారం ఉదయం రూమ్ టు రీడ్ స్వచ్చంద సంస్థ అద్వర్యం లో యాద్గిర్ రోడ్డులో ఉన్న (KGBV) కస్తుర్బ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్ల లకు ఒత్తిడిని తట్టుకొని మేరుగైన విద్యను, నైపుణ్యాన్ని అందించాలనే ఉదేశ్యం రూమ్ టు రీడ్ స్వచ్చంద సంస్థ వారు జిల్లాలోని KGBV ల్లో మోడల్ లైఫ్ స్కిల్స్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల స్వచ్చంద సంస్థను అభినందిచారు. పిల్లలకు చిన్న వయసు నుండే జీవన నైపుణ్యాలు అవసరం అని అవి వారి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. చిన్న వయసు నుండే చదువుతో పాటు జీవన నైపుణ్యాలను అవసరమైన ఆటలు, నైతిక విలువలు నేర్పించడం వల్ల పిల్లలు ఆత్మ విశ్వాసంతో ఎదుగుతారని సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు కోనసాగుతు ఉన్నత శిఖరాలను చెరుకుంటారన్నారు.. కోవిడ్ వలన పిల్లలు రెండు సంవత్సరాలు పాఠశాలలకు దూరం అయ్యారని, తిరిగి పిల్లలు పాఠశాల వాతావరణానికి అలవాటు పడడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్ లో పిల్లలకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో ఇద్దరు టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, మిగతా కెజిబివిల్లో సైతం ఇటువంటి మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్స్ ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని రూమ్ టూ రీడ్ జిల్లా కోఆర్డినేటర్ చరితవ్యకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి లియాఖత్ అలీ, కెజిబివి ప్రత్యేకాధికారి శ్వేతా, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ చరితవ్య, శ్రీనివాస్, రాజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.