బాల కార్మికులు లేని సమాజం మన లక్ష్యం కావాలని అందుకు చైల్డ్ ప్రొటెక్షన్ కు సంబంధించి న CwC, చైల్డ్ లైన్, చైల్డ్ లేబర్, బాల రక్ష భవన్, DRDO , DCPO, శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అందుకు పోలీస్ శాఖ కూడా తమ వంతు పాత్ర పోషిస్తుందని రంజిత్ ప్రకాష్, ఐ ఎల్ ఓ ,జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.

బాల కార్మికులు లేని సమాజం మన లక్ష్యం కావాలని అందుకు చైల్డ్ ప్రొటెక్షన్ కు సంబంధించి న CwC, చైల్డ్ లైన్, చైల్డ్ లేబర్, బాల రక్ష భవన్, DRDO , DCPO, శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అందుకు పోలీస్ శాఖ కూడా తమ వంతు పాత్ర పోషిస్తుందని రంజిత్ ప్రకాష్, ఐ ఎల్ ఓ ,జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.

మంగళవారం హరిత హోటల్ లో కార్మిక శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. రేపటి బావిభారత పౌరులుగా భావించే చిన్నారులను వివిధ పనులలో చేర్చి వెట్టిచాకిరి చేయించడం నేరం అని అందుకు కారకులైన వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యo గా జిల్లాలో బాలలను బాల కార్మికులు గొర్రెల కాపరీలుగా, గృహ నిర్మాణ పనులలో, వ్యవసాయ సీడ్ పత్తి పనులలో, కిరణం, మెకానిక్ షాప్ లలో బాలలను కార్మికులుగా పెట్టుకుంటున్నారని SI స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించిన ఆపరేషన్ ముస్కాన్ బృందం ద్వారా ఇప్పటికే 48 మంది చిన్నారులను గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విముక్తి చేశామని అందుకు కారకులైన వారిపై జరిమానాలు విధించడం తో పాటు చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తున్నామని, అన్నారు. మైనర్ల పై లైoగిక వేధింపులకు గురి చేసే వారి పై పొక్సో యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని, యువత ప్రవర్తన పై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల పై వారికి అవగాహన కల్పించాలని అందుకే గ్రామాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని అన్నారు. 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలతో ఏ యజమాని కూడా పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టం- 3 ప్రకారము చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. బాలలతో నిర్బంధంగా పని చేయించరాదని, చేయించినచో బాండెడ్ లేబర్ చెటం  1976 ప్రకారము చర్యలు  గైకొనబడతాయని హెచ్చరించారు. ఆడ మగ తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని కూడా హెచ్చరించారు. సొంత పిల్లలతో కూడా తల్లిదండ్రులు కూలి పనులు చేయించడం కూడా నేరమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, జిల్లా అధికారులు, ఎన్ జి  ఓ లు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————         జిల్లా పౌరసంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారీ చేయబడినది

 

 

 

Share This Post