బాల కార్మిక నిర్మూలనలో వేల్పూర్ మండలం 20 ఏళ్ల క్రితం దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం, అంకితభావం వల్లనే సాధ్యమైంది పిల్లలను పనిలోకి పంపించవద్దని ప్రజలకు అవగాహన వచ్చింది –మాజీ జిల్లా కలెక్టర్, ప్రస్తుత జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ అశోక్ కుమార్ అప్పుడు పనిచేసిన ప్రజా ప్రతినిధులు అధికారులకు కలెక్టరేట్లో సన్మాన కార్యక్రమం అప్పటి జ్ఞాపకాలను విషయాలను గుర్తు చేసుకున్న అధికారులు ప్రజా ప్రతినిధులు

ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, వీడీసీలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లనే 2001లో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొట్టమొదటి బాల కార్మికులు లేని మండలంగా ప్రకటించుకోవడం జరిగిందని 2001 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న
జి. అశోక్ కుమార్ తెలిపారు.

దేశంలో ప్రప్రథమంగా వేల్పూర్ ను బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించిన మండలంగా 20 సంవత్సరాల క్రితం ప్రకటించిన నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా అప్పుడు పనిచేసిన మండలంలోని సర్పంచులు ప్రజా ప్రతినిధులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు అధికారులతో శుక్రవారం నాడు ప్రగతి భవన్ సమావేశ మందిరంలో
43728″ />20 సంవత్సరాల సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2001 సంవత్సరంలో వేల్పూర్ మండలంలో పదిహేను గ్రామాలలో పనిచేసిన సర్పంచులు ఎంపీటీసీలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు మండలంలో పనిచేసినప్పటి మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించారు. అవగాహన కార్యక్రమాన్ని, వర్క్షాప్ను నిర్వహించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన మండలంగా వేల్పూరు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని, దీనిని సాధించడానికి ఎంతోమంది ఇది తమవంతుగా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించి అంకితభావంతో పని చేసిందని విజయవంతమైందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధిత అధికారులతో పాటు అప్పటి సీఎంవో సుధాకర్ రావు కృషి ఎంతైనా ఉన్నదని ప్రశంసించారు. మండలములోని 539 మంది బాలకార్మికులను బడుల్లో చేర్చామని దీనిని సాధించడానికి చాలా కృషి చేయవలసి వచ్చిందని ఈ కార్యక్రమాన్ని మిగతా కలెక్టర్లు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లారని అన్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలు బడిలో ఉంటేనే మంచిదనే విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని వారి పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు పైననే దేశం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని దేశానికి పిల్లలే ముఖ్యమని ఆయన అన్నారు కేరళ రాష్ట్రం కూడా చదువుపై శ్రద్ధ పెట్టి ఒక మిషన్ లాగా ముందుకు తీసుకు వెళ్లిందని, పిల్లలను పనికి కాకుండా బడికి పంపాలనే భావన తల్లిదండ్రులకు రావడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ కూడా అ చదువుపై అత్యంత శ్రద్ధ అ చూపుతున్నారని ఒకే రోజు రాష్ట్రమంతటా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడం బిసి మైనార్టీ ఎస్సీ ఎస్ టి సంక్షేమ విద్యాసంస్థలు ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం చదువు గురించి అందరికీ అవగాహన ఏర్పడిందని ఇది ఒక మంచి పరిణామమని ఆయన తెలిపారు. అప్పటి గ్రామాభివృద్ధి కమిటీ లు కూడా ముందుకు వచ్చి తమ పిల్లలను పనులకు కాకుండా బడికి పంపిస్తామని ముందుకు వచ్చారని ప్రపంచానికి ఈ మండలంలోని ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలిచారని ఆయన శ్లాఘించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాలలో తమ వంతుగా తోడ్పాటు అందించారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో రెంజల్ ఎడపల్లి మండలాలు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా తమ అనుభవాలను ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడంపై ఆన్లైన్ లో మాట్లాడారు.

వి వి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం శ్రీనివాస్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన డైరెక్టర్ కే శ్రీనివాస్, రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ సి ఎస్ రాణి కుముదిని మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అప్పటి అధికారులు ప్రత్యేకంగా కృషి చేసి కష్టపడి ఈ ఘనతను సాధించారని తద్వారా దేశానికే ఆదర్శంగా మండలాన్ని , జిల్లాను నిలిపారని అన్నారు. 20 ఏళ్ల క్రితం బాల కార్మిక నిర్మూలన కు అప్పటి అధికారులు ప్రజా ప్రతినిధులు ఒక ఉద్యమంగా పనిచేశారని బాల కార్మికులు మండలంగా ప్రకటించుకున్నారు అని తద్వారా ఒక మంచి పనిని ప్రతి ఒక్కరు గర్వించే లాగా చేశారని అప్పటి ఆర్మూరు శాసనసభ్యులు/ ప్రస్తుత నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు/ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అప్పటి సీఎంఓ సుధాకర్ రావు తమ అనుభవాలను అమెరికా నుండి పంచుకున్నారు.

కార్యక్రమానికి హాజరైన అప్పటి పలువురు మండల ప్రజా ప్రతినిధులు, వీడీసీ లు అధికారులు మాట్లాడుతూ అప్పటి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే, ముందుండి దారి చూపడం వలనే తమ వంతుగా ధైర్యంగా అంకిత భావంతో విధులు నిర్వహించామని ఇందులో తాము భాగస్వాములైనందుకు జీవితాంతం గుర్తుంచుకుంటామని అన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యక్రమానికి అతిథులను ఆహ్వానిస్తూ, అశోక్ కుమార్ సార్ ను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారని ఎడపల్లి మండలం అశోక్ సాగర్ ఆయన వల్లనే అభివృద్ధి చెంది ఆ పేరు తెచ్చుకున్న అని తన సిబ్బంది ద్వారా తెలిసిందని వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి సరియైన అవగాహన లేని ఆ కాలంలోనే లక్షా 40 వేల మరుగుదొడ్లు నిర్మించారని అదేవిధంగా నీటి పరిరక్షణ గురించి చాలా పనులు నిర్వహించినట్లు తెలిపారని పనుల్లో నాణ్యత జవాబుదారితనం వారి కాలంలో నన్ను చూస్తే తెలుస్తుందని దేశంలోనే బాల బాల కార్మిక వ్యవస్థను వేల్పూర్ మండలంలో నిర్మూలించడం ద్వారా మండలానికి, జిల్లాకు తద్వారా రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చిందని 9 జూలై 2001లో కార్యక్రమాన్ని చేపట్టి 2 అక్టోబర్ 2001లో బాల కార్మికులు లేని మండలంగా అతి తక్కువ కాలంలో ప్రకటించడం వారి పనితనానికి, అధికారుల అంకితభావానికి, ప్రజాప్రతినిధుల సహకారానికి ఒక ఉదాహరణ అని అన్నారు.
కార్యక్రమం అనంతరం కలెక్టర్ ఓటాఫ్ థాంక్స్ చెబుతూ వేరే జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధుల సపోర్టు తప్పక ఉంటుందని ఈ సబ్జెక్టును మరింత ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు గా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 2001లో వేల్పూర్ మండలంలో పనిచేసిన అధికారులకు ప్రజాప్రతినిధులకు సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో వి వి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో డాక్టర్ హెలెన్ ఆర్ శేఖర్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, శిక్షణ సహాయ కలెక్టర్ మకరంద్, అప్పటి సి పి ఓ షేక్ మీరా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

<img src=”https://ipr.telangana.gov.in/wp-content/uploads/2021/10/Photo-8-1-300×200.jpg” alt=”” width=”300″ height=”200″ class=”alignnone size-medium wp-image-

Share This Post