బాల రక్షక్ మొబైల్ (1098) వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాలు & బి.సి.సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, ICDS పిడి పద్మావతి. ( కరీంనగర్ జిల్లా ).

బాలలకు సత్వర సేవలు అందించేందుకు
బాల రక్షక్ వాహనం

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0000

జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటు లోకి వచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బాల రక్షక్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలు త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్షక్ వాహనం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నవంబర్ 14న రాష్ట్రం మొత్తం 33 వాహనాలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించారు అన్నారు. ఆపదలో ఉన్న పిల్లలు ఎక్కడ కనపడినా హెల్ప్ లైన్ 1098 నెంబర్ కు ఫోన్ చేస్తే ఈ వాహనంలో సంబంధించిన అధికారులు వచ్చి పిల్లల రక్షణ మరియు సంరక్షణ చూసుకుంటారని అన్నారు జిల్లాలోని బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. అలాగే గతంలో కంటే ఇప్పుడు బాలలకు అత్యంత దగ్గరగా సేవలు అందించేందుకు అనుకూలంగా బాలల కోసం ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న బాలల వద్దకు అధికారులు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి సూచించారు.

Share This Post