బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణ

చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కుమ్మరి వారికి మట్టి గణపతులు చేయడంలో బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 13 నుంచి హన్మకొండలో 200 మందికి మట్టి గణపతుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ  కార్పొరేషన్ ఎండి కె.‌ అలోక్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. బిసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, బిసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారి ప్రోత్సాహంతో గతంలో మట్టి గణేషులు తయారీలో 50 మంది కుమ్మరి వారికి శిక్షణ ఇచ్చామన్నారు. వారంతా ఎకో ఫ్రెండ్లీ  మట్టి గణపతి విగ్రహాలు  తయారు చేసి ఆర్థికంగా లబ్ధి పొందారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగానే ఈ నెల 13 నుంచి నిర్వహించే వర్క్ షాప్ లో రెండు వందల మందికి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.   ప్రతి బ్యాచ్ లో ఇరవై మందికి శిక్షణ ఇస్తామని, మొత్తం పది బ్యాచ్ లుగా శిక్షణ ఉంటుంది అన్నారు.  ఈ శిక్షణ ద్వారా ఐదు అడుగులు, అంతకు మించి  ఎత్తులో మట్టి గణపతి విగ్రహాలు తయారు చేయడంలో వారు నైపుణ్యం సాధించి సులభంగా విగ్రహాలను తయారు  చేయగలుగుతారన్నారు.

Share This Post