బిసి సంక్షేమ హాస్టళ్ళలో హాజరు శాతం పెరుగుదల:: జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. రవీందర్.

జనగామ నవంబర్ 02 : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలతో జిల్లాలోని ప్రభుత్వ బిసి సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్దుల హాజరు శాతం క్రమంగా పెరుగుతూ వస్తుందని జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. రవీందర్ అన్నారు. జిల్లాలో ఉన్న (02) బాలికల, (08) బాలుర ప్రీ మెట్రిక్ హాస్టళ్ళలో కోవిడ్ ప్రోటోకాల్ లు పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ మార్కింగ్ చేయడం జరిగిందని, మాస్కులు ధరించడం, కోవిడ్ పై అవగాహన, థర్మల్ స్కానర్ లతో విద్యార్దులకు ఎప్పటికప్పుడు పరీక్షలు, విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రీ మెట్రిక్ హాస్టళ్ళలో ఉన్న విద్యార్దినీ విద్యార్దుల సంఖ్య 62 శాతానికి (03) బాలికల, (03) బాలుర పోస్ట్ మెట్రిక్ విద్యార్దినీ విద్యార్దుల సంఖ్య 72 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. విద్యార్దినీ విద్యార్దులకు అవసరమైన కార్పెట్ లు, బెడ్ షీట్లు, నోట్ బుక్ లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

Share This Post