బిసీ సంక్షేమ గురుకుల్లో 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే (జూన్ 2 వ తేదీ) ఆఖరు తేదీ అని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

 6, 7, 8వ తరగతిలో ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు నేడే (జూన్ 2) ఆఖరు తేదీ 

  • మల్లయ్య బట్టు, కార్యదర్శి

 

బిసీ సంక్షేమ గురుకుల్లో  6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే (జూన్ 2 వ తేదీ) ఆఖరు తేదీ అని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ  గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు  ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 19 జూన్ న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.

 

డిగ్రీ, ఇంటర్ కోర్సుల ప్రవేశపరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి 

 

డిగ్రీ, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే బిసీ విద్యార్థులకు ఈనెల 5న  నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్ 5వ తేదీన పరీక్ష నిర్వహిస్తామన్నారు.  ప్రవేశ పరీక్షలకు సంబంధించి, హాల్ టికెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చని ఆయన  సూచించారు.

 

మల్లయ్య బట్టు,  

కార్యదర్శి,

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ

గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్

 

Share This Post