బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగుల కోసం చేపట్టిన రెండవ విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్

బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగుల కోసం శనివారం చేపట్టిన రెండవ విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు  కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ తో సహా సచివాలయ ఉద్యోగులకు జూన్ 11, 12 తేదీలలో రెండురోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఏర్పాటు చేసి మొదటి విడత టీకాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఉద్యోగులందరు  సంతోషం వ్యక్తం చేశారు.

        ఈ కార్యక్రమంలో జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.ఎ.డి. జాయింట్ సెక్రెటరీ చిట్టిరాణి, డిప్యూటి DMHO డా.పద్మజ  తదితరులు పాల్గొన్నారు.

Share This Post