బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి యొక్క సామాజిక అభివృద్ధి కొరకు  అధికారులు కృషిచేయాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు టి. నరసింహ తెలిపారు

బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి యొక్క సామాజిక అభివృద్ధి కొరకు  అధికారులు కృషిచేయాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు టి. నరసింహ తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్క నరసింహ మాట్లాడుతూ  కోవిడ్ సమయంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, వారి యొక్క జీవన విధానం  ఎలా ఉన్నారు, వారి జీవన విధానం సాఫీగా సాగడానికి అధికారులు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల యొక్క సామాజిక అభివృద్ధి ఎలా జరుగుతుందో రాష్ట్రంలో అమలు చేస్తున్న విధివిధానాల గురించి తెలుసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి కుటుంబాల కు చెందిన విద్యార్థుల యొక్క విద్యా బోధన వారికి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల గురించి డిఇఓ వాసంతి ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చేస్తున్న బోధనపై సబ్జెక్ట్ల వారీగా టీచర్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని బీసీ ఎస్సీ ఎస్టీ వారి యొక్క హౌస్ ఓల్డ్, పాపులేషన్ వివరాలు అడగగా జిల్లా అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ బిసి కుటుంబాలు 2 ,3 5, 2 5 5 ఉండగా వారి పాపులేషన్ 7,72,7 33 ఎస్స్సి కుటుంబాలు 69,05 9 ఉండగా పాపులేషన్ 2,35, 306 ఉన్నారని ఎస్టి వారు కుటుంబాలు 40,638 పాపులేషన్ 1,37,0 18 ఉన్నారని కమిటీ సభ్యులకు అదనపు కలెక్టర్   తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఈ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పంచిన భూమి వివరాలు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వీరి వద్ద నుండి తీసుకున్న టువంటి భూములకు ఇచ్చిన పరిహారం వివరాలు ఆర్డీవో లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన వాటిని సభ్యులకు వివరించారు జిల్లాలో లో బి సి ఎస్ సి ఎస్ టి వారికి అన్ని అన్ని పథకాలలో వారికి లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన పథకాల గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం సభ్యులు యొక్క టి.నరసింహ మాట్లాడుతూ ఎస్సీ మరియు ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎన్ని నమోదు , ఎంత మందికి నష్ట పరిహారం అందించారు అడిగగా 2014 నుండి 2021 వరకు 178 మందికి గాను 168 కేసులలో 79,8 7,500  రూపాయలు  పరిహారం అందజేశామని ఇంకా పదిమందికి వారి యొక్క బ్యాంకు ఖాతా యొక్క వివరాలు తెలప నందువల్ల ఇవ్వలేకపోయా మని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు సంక్షేమ టి. నరసింహ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి వెంకటలక్ష్మి,  డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
????????????????????????????????????
????????????????????????????????????
????????????????????????????????????
.

Share This Post