బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వైభవంగా సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి వేడుకలు

*బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి వేడుకలు*

*రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం*

*సాహసమే ఊపిరిగా, ధైర్యమే ఆయుదంగా బతికిన బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న*

*కేవలం కులానికే కాదు యావత్ తెలంగాణ జాతికి గర్వకారణం సర్దార్*

*సర్వాయి పాపన్న స్పూర్తిగా పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్*

*ఘనంగా స్మరించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్*

*ఢిల్లీ పాలనను ధిక్కరించి తెలంగాణను పరిపాలించిన బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న*

*తెలంగాణ వాడీ వేడిని నాడే చాటిచెప్పిన శౌర్య పరాక్రమవంతుడు*

*మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్*

*రవీంద్రభారతిలో వేలాదిగా హాజరైన ప్రజలు అభిమానులు, నేతలు*

తెలంగాణ పోరాట యోదుడు, ఢిల్లీ సింహాసనాన్ని ఎదురించి తెలంగాణలో సుస్థిర పాలన అందించిన బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేసారు. సాహసమే ఊపిరిగా, ధైర్యమే ఆయుదంగా బహుజనుల్ని ఛైతన్యవంతం చేసి ఏకం చేసిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, పెద్దలను కొట్టి పేదలకు పంచిన మహామనిషి ఆయన పోరాట పటిమను స్మరించుకున్నారు మంత్రి గంగుల. సర్దార్ని ఏ ఒక్క కులానికో పరిమితం చేయోద్దనీ యావత్ తెలంగాణతో పాటు జాతి ఆస్థి అని అన్నారు. మనం వెనుకబడ్డవాల్లం కాదని వెనుకకు నెట్టేయబడ్డామని, గత పాలకులు దరఖాస్తు ఇచ్చి దండంపెట్టినా ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోలేదని నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో పాలన అందిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున వేల కోట్ల విలువైన 82.3 ఎకరాల్ని కోకాపేట్, ఉప్పల్ వంటి ఏరియాల్లో ఇవ్వడమే కాక ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు 95కోట్ల నిధుల్ని సైతం కేటాయించారన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే మెజార్టీ కుల సంఘాలు ఏకమై ఆత్మగౌరవ భవనాల్ని నిర్మించుకున్నాయని, పెద్ద సంఖ్యలో ఉండే గౌడ కులస్థులు సైతం ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలుజరుగుతుందన్నారు. కళ్యాణలక్ష్మీ, గురుకులాలు వంటి అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నారన్నారు.

సర్వాయి పాపన్న గారికి కరీంనగర్ జిల్లాతో విడదీయలేని అనుభందం ఉందని, వీరోచిత పోరాటంతో హుస్నాబాద్ లో విజయ స్వర్గాన్ని పొందారన్నారు, ఆ స్పూర్తితో కరీంనగర్లో అద్బుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపేసాయని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాకే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు అందజేస్తూ అధికారికంగా జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాద్యమవుతుందన్నారు. నాడు పశువులు కాస్తూ కులవ్రుత్తి చేసుకుంటున్న సర్దార్ సర్వాయి పాపన్న నుండి నాటి ప్రభుత్వం బలవంతంగా శిస్తు వసూలు చేస్తుంటే తిరగబడి బడుగు, బలహీనవర్గాల్ని ఏకం చేసి రాజ్యాదికారం సాదించాడని స్మరించుకున్నారు. అలా సొంత సైన్యంతో కాకతీయ, గొల్కొండ వంటి కోటల్ని గెలుచుకొని జనరంజక పాలనను అందిచారని, అదే స్పూర్తితో గత 70ఏళ్లుగా స్వార్థ రాజకీయాలకు విచ్చినమైన కులాల్లో తెలంగాణ ప్రభుత్వం ఐక్యతను సాధిస్తుందన్నారు మంత్రి తలసాని, దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్రుషితో గౌడలకే కాదు బడుగు, బలహీన బీసీ వర్గాల అభ్యున్నతికి వేలకోట్ల విలువైన భూములు, నిధులిచ్చి ఆత్మగౌరవ భవనాలు కళ్యాణలక్ష్మీ, రైతు బందు, రైతు బీమా, గురుకులాలు ఇలా అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నారన్నారు, వీటిపై అవగాహన లేని వ్యక్తులే విమర్శలు చేస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు మంత్రి తలసాని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బహుజనుల సంపూర్ణ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అని, సర్వాయి అనే పేరు తన సైన్యాధ్యక్షుడై అమరుడైన రజకుని పేరుని కలుపుకొని సమైక్య పోరాట యోదుడన్నారు 33 కోటల్ని జయించి గోల్కొండ కోటతో పాటు మొగలులు ఆక్రమించిన కాకతీయుల కోటను సైతం గెల్చుకున్నాడన్నారు, 56 బీసీ కులాల్ని ఏకం చేసి 33 కులాలకు నాడే రాజ్యాధికారం అందించారన్నారు. రాజులు ప్రజల్ని దొచుకుంటే వాళ్లను దోచి పేదలకు పంచిన గొప్ప వీరుడన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహిద్దామని అడిగిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకల్ని నిర్వహించారన్నారు.

బీసీ మంత్రి గంగుల కమలాకర్ చొరవతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడలకోసం మోపెడ్లు, వైన్స్ లో 15 శాతం రిజర్వేషన్లు, పన్నురాయితీల్ని గౌడలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందని గుర్తచేసారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర,  పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

 

Share This Post