బీసీ హాస్టల్ లో విద్యనందించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

ప్రచురణార్థం

బీసీ హాస్టల్ లో విద్యనందించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

మహబూబాబాద్ నవంబర్ 22.
బీసీ వసతి గృహాలలో ఉండి ఉచితంగా విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థినీ విద్యార్థులనుండి దరఖాస్తు లు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

జిల్లాలో బీసీ సంక్షేమార్థం విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు వసతి కల్పించేందుకు కు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో మహబూబాబాద్ బాయ్స్ హాస్టల్స్ లో 58 ఖాళీలు, గూడూరు బాయ్స్ హాస్టల్ లో 73, పెద్దవంగర బాయ్స్ హాస్టల్స్ 57, చెర్లపాలెం బాయ్స్ హాస్టల్ 55, నర్సింహులపేట బాయ్స్ హాస్టల్ 23, మరిపెడ బాయ్స్ హాస్టల్ 27, మరిపెడ గర్ల్స్ హాస్టల్ 20, గార్ల గర్ల్స్ హాస్టల్ 68 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు.

అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ కళాశాల హాస్టల్స్ లో మహబూబాబాద్ బీసీ బాయ్స్ 75 ఖాళీలు, గర్ల్స్ హాస్టల్ లో 65, మరిపెడ గర్ల్స్ హాస్టల్ లో 60, తొర్రూరు బాయ్స్ హాస్టల్ లో 80, తొర్రూర్ గర్ల్స్ హాస్టల్ లో 84, మరిపెడ బాయ్స్ హాస్టల్ లో 90 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

అర్హులైన వాళ్ళు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందాలన్నారు.
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post