ఈ సందర్భంగామంత్రికి పూజారులు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ బద్ధంగా డోలు సన్నాయి మేళాలతో ఘన స్వాగతం పలికారు. జాతరకు వచ్చే భక్తులకు ఫస్ట్ ఎడ్ చికిత్స కై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.
అనంతరం గ్రామస్తులతో మంత్రి కాసేపు ముచ్చటించారు.
అంతకు ముందు దొడ్ల గ్రామం లోని సారలమ్మ తల్లిని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ జిల్లా పరిషత్ కోఆప్షన్ నెంబర్ వలియాబి జెడ్పి సీఈవో ప్రసూన రాణి, డి ఎం హెచ్ వో అప్పయ్య డిపిఓ వెంకయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత ఈవో రాజేందర్ పూజారులు కాక భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.