బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు 161, 161- బి, మరియు 765- డి పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ, అటవీ ,విద్యుత్తు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, వక్స్ బోర్డు, దేవాదాయ శాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 11:–
జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు 161, 161- బి, మరియు 765- డి పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ, అటవీ ,విద్యుత్తు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, వక్స్ బోర్డు, దేవాదాయ శాఖల అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణాల్లో ఎవేని కట్టడాలు, ప్రార్థనా స్థలాలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, నీటి పైప్ లైన్లు, అటవీ భూములకు సంబంధించి సమస్యలు ఉన్నట్లయితే, ఆయా శాఖల అధికారుల కోఆర్డినేషన్ తో పరిష్కరించాలని సూచించారు.

161-బి రహదారి పనులలో ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ ఫార్మర్ ల షిఫ్టింగ్ నకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. నీటి పైపులకు సంబంధించి సంబంధిత ఏజెన్సీకి అంచనాలు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. రఘువీర్ కు సూచించారు.

ఆయా జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి సమస్యలు పరిష్కరించడంలో ఆయా తహసీల్దార్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు చొరవ చూపాలన్నారు.

కోర్టు కేసులు, కట్టడాలు, ప్రార్థనా మందిరాల తొలగింపులో ఏర్పడుతున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, భూసేకరణ, చెల్లింపులకు సంబంధించి నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన చోట జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నేషనల్ హైవే- 161 పీడీ మధుసూదన్ రావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ రఘు వీర్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, విద్యుత్తు,వక్స్ ఎండోమెంట్ శాఖల అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు తహశీల్దార్లు ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post