బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2021 సంవత్సరానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2021 సంవత్సరానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో టాప్ 20 లో మన జిల్లా నుండి రెండు పాఠశాలలు ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు రామచంద్రపురం, కేశాల పాఠశాలల విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు .
ఇట్టి కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ స్కూల్ ఇన్నోవేషన్ సెల్ , యూనిసెఫ్ మరియు, ఇంక్విలాబ్ పౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లూ తెలిపారు.
ఇట్టి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి దోహదపడుతాయన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా నూతన ఆవిష్కరణలు రూపొందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ , సెక్టోరల్ అధికారులు వెంకటేశం, పవన్ కుమార్ , అనురాధ , సుప్రజా, మండల విద్యాధికారి వెంకట నరసింహులు పాల్గొన్నారు.

Share This Post