బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైరా పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని, పాఠశాలల తని ఖీలను చేపట్టారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 03 ఖమ్మం

బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైరా పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని, పాఠశాలల తని ఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పట్టణ ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలు నాటారు. ఇప్పటి వరకు ఐదు వందల మొక్కలను వాటినట్లు మిగులు మొక్కలను నాటడం వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం పట్టణంలో
షాధిఖానా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. 45 లక్షల వ్యయంతో చేపడ్తున్న షాదిఖానా నిర్మాణ పనులు 30. లక్షల మేర ఇప్పటి రవకు ఖర్చు చేయడం జరిగిందని, మిగిలిన పనులన్నింటిని ఆగష్టులోగా పూర్తి చేసి, షాదిఖానాను ప్రజలకు వాడుకలోకి తేవాలన్నారు. అనంతరం కలెక్టర్ పిష్ సీడ్ ఫామ్ పనులను సందర్శించి కొర్రమేను ఫిష్ సీడ్ తయారీని పరిశీలించారు. ఫిష్ సీడ్ ఉత్పత్తి సమయం, చేపల ఎదుగుదల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైరాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మన ఊరుమనబడి కార్యక్రమం క్రింద చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధునాతన వెజ్, నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. వెజ్ మార్కెట్ మొదటి స్లాబ్ ఆగష్టు కల్లా పూర్తి చేయాలని, రెండవ స్లాబ్ వచ్చే సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియాన్ని కలెక్టర్ పరిశీలించారు. టేన్నీస్ కోర్టులు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను సందర్శించి పదోవ తరగతి విద్యార్థినీలతో కలెక్టర్ సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్ధినీలతో బోధన విషయం, వారి భవిష్యత్ లక్ష్యం గురించి ఆ లక్ష సాధనకు వారు చేసే ప్రయత్నం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యం నిర్దేశించుకొని ఇష్టపడి చదవి ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ ఉద్బోదించారు. గురుకుల విద్యాలయం అంతా కలియ తిరుగుతూ తరగతి గదులు, డార్మెటరీలను పూర్తిగా వినియోగించుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఖాలీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థినిలతో మధ్యాహ్నభోజనం చేశారు. విద్యార్థినీలను ఇండోర్ స్టేడియంకు పంపించి. క్రీడల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం తెలంగాణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంలో పంచాయితీరాజ్ ఇ ఇ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్, టి.ఎస్.ఐ.డి.సి.ఇ.ఇ నాగశేషు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి, మున్సిపల్ కమీషనర్ వెంకటపతిరాజు, తహశీల్దారు ఆరున, టి.పి.ఓ భాస్కర్, ఏ. ఇ అనిత, ఎఫ్.డి.ఓ బుజ్జిబాబు, స్థానిక ప్రజాప్రజానిధిలు, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post