బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మధిర మండలం రొంపిమల్ల గ్రామంలో పర్యటించి దళితబంధు పథక లబ్ధిదారులకు అందించిన యూనిట్లను పరిశీలన చేశారు.

ప్రచురణార్ధం

ఆగష్టు,03 ఖమ్మం:-

బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మధిర మండలం రొంపిమల్ల గ్రామంలో పర్యటించి దళితబంధు
పథక లబ్ధిదారులకు అందించిన యూనిట్లను పరిశీలన చేశారు. గ్రామంలో మంజూరైన డైరీ, ట్రాక్టర్, గూడ్స్
వెహికిల్, డ్రోన్ స్పేయర్, టెంట్ హౌస్, ఎలక్ట్రికల్ సెల్స్, సెంట్రింగ్ యూనిట్, షిఫ్ యూనిట్లు, రాతెండి సామాన్ల
అమ్మకం యూనిట్లను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. డైరీ యూనిట్ల వద్దకు వెల్లినప్పుడు గేదలను ఎక్కడ
నుండి తేవడం జరిగిందని, పశువైద్యులు వచ్చి టీకాలు ఇచ్చినది లేనిది, పశుగ్రాసం పెంపకంకు చేపట్టిన
చర్యల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ యూనిట్ను వ్యవసాయ పనులు జరుగుచున్న
ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలని లబ్దిదారునికి సూచించారు. దళితబంధు పథకం ద్వారా పొందిన యూనిట్లను ఖాళీగా
ఉంచకూడదని, ఎక్కడ పని దోరికితే అక్కడికి వెళ్లాలని కలెక్టర్ లబ్దిదారులకు సూచించారు.
యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని కలెక్టర్ అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంలో పంచాయితీరాజ్ ఇ.ఇ శ్రీనివాస్, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ఏలూరి
శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మధార్, తహశీల్దారు రాంబాబు అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post