బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మల్హర్రావు మండల కేంద్రం తాడిచర్లలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాల్లో తనిఖీ చేసే ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 8 (బుధవారం).

బుధవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మల్హర్రావు మండల కేంద్రం తాడిచర్లలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాల్లో తనిఖీ చేసే ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ రిజిస్టర్ ను పరిశీలించి 50 శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి కావడం అసహనం వ్యక్తం చేసి వెంటనే 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, ప్రతిరోజు ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయాలని, అడ్వాన్సు టూర్ డైరీలను మెయింటెన్ చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఆస్పత్రికి వచ్చిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఏఎంఆర్ కంపెనీ వారు వారానికి మూడు రోజులు నియమించిన డాక్టర్ ను ఆసుపత్రిలోనే అన్ని రోజులు పూర్తిస్థాయిలో ఉండేలా నియమించాలని ఏఎంఆర్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి, ఆస్పత్రి వేస్టేజిని పూడ్చడానికి 2 గుంతలను తవ్వించాలని మండల పంచాయతీ అధికారి విక్రంను ఆదేశించారు.

ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించారు.ఈ సందర్భంగా 50 శాతం మంది ఉపాధ్యాయులు వివిధ కారణాలతో సెలవుల్లో ఉండడంపై ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ పై అసహనం వ్యక్తం చేసి ఒకరోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండకుండా చూడాలని, మధ్యాహ్నం భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, దాదాపు 18 నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమై విద్యార్థులు తరగతులకు వస్తున్నందున వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించాలని, కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని అభినందించారు. మధ్యాహ్నం భోజనం వండడానికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. అదేవిధంగా తాడిచర్లలో నూతనంగా నిర్మించిన హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలకు కాంపౌండ్ వాల్ మరియు మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ అశోక్ ను ఆదేశించారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయంని తనిఖీ చేసి క్లోజ్డ్ ఫైళ్ళను స్కానింగ్ చేసి ప్రత్యేకంగా గ్రామాలు, సర్వే నెంబర్ల వారీగా భూమీ వివరాలను రికార్డు చేయాలని, కరెంట్ ఫైళ్లను ఇ-ఆఫీసులో పొందు పరచాలని, సిబ్బంది అందరూ తప్పకుండా ఇ అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయాలని తాసిల్దార్ శ్రీనివాస్ ను ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి నిర్మాణంలో వున్న తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణంను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతానన్నారు.
అనంతం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి గ్రామాలలో సమర్థవంతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, సరిగ్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని, అధిక వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు వేదిక నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, అధికారులంతా తప్పకుండా ఇ-అటెండెన్స్ అప్ లో హాజరు నమోదు చేయాలని, కరోనా వ్యాక్సిన్ నెమ్మదిగా జరుగుతున్నందున త్వరగా 100% పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే మానేరు నదిలో జిల్లా ప్రాంతాన్ని గుర్తించేందుకు వర్షాలు తగ్గిన వెంటనే సర్వే చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

కలెక్టర్ పర్యటనలో ఎంపీపీ మల్హర్రావు, మండల ప్రత్యేక అధికారి ఆర్.సుదర్శన్, ఎంపీడీవో నరసింహమూర్తి, ఎంఈఓ దేవానాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి జె.భాస్కర్, డిప్యూటీ తాసిల్దారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

డీపీఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post