బుధవారం నాడు వాసాలమర్రి గ్రామం రైతు వేదిక భవనంలో దళిత బంధు పథకం లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలుసుకొని ఏ ఏ రంగాలలో అవగాహన కలిగింది, దేనిలో ఉపాధి పొందేది అడిగి తెలుసుకున్నారు.

బుధవారం నాడు వాసాలమర్రి  గ్రామం రైతు వేదిక భవనంలో  దళిత బంధు పథకం లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలుసుకొని ఏ ఏ రంగాలలో అవగాహన కలిగింది, దేనిలో ఉపాధి పొందేది అడిగి తెలుసుకున్నారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం కింద వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బుధవారం నాడు వారిని రైతు వేదిక భవనంలో కలిసారు.
ఇ. డి.,  ఎస్ సి కార్పొరేషన్, జిల్లా పరిశ్రమల శాఖల  సమన్వయంతో ఇప్పటివరకు మూడు సార్లు జరిగిన క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాలలో పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మల్బరీ తోటలు,  పూల తోటల పెంపకం, పట్టు పరిశ్రమలపై వారికి ఎంతవరకు అవగాహన కలిగింది, ఏ రంగంలో ఉపాధి పొందుతారు,  ఏది ఎంపిక చేసుకుంటారు అనేది స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్రెడ్డి, ఇ.డి.  ఎస్ సి కార్పొరేషన్ శ్యాంసుందర్, ఎం.పి.పి. సుశీల,  గ్రామ సర్పంచ్ ఆంజనేయులు,  తాసిల్దార్ జ్యోతి, ఎండిఓ ఉమాదేవి,  జిల్లా హార్టికల్చర్ అధికారి అన్నపూర్ణ,  గ్రామ పంచాయతీ సెక్రటరీ రమణారెడ్డి పాల్గొన్నారు.

Share This Post