బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కార్యాలయ సిబ్బంది కొరకు కంటి వెలుగు-2 కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ప్రారంభించి కంటి పరీక్షల తీరును పరిశీలించారు. రాష్ట్రం మొత్తం విజయవంతంగా కోనసాగుతున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డా. కాశీనాథ్ ఆద్వర్యంలో కలెక్టరేట్ సిబ్బందికి అందరికీ కంటి పరీక్షలు జరిపి అద్దాలను అందించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పనిచేస్తున్నందున ఓకే రోజు అందరికీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి అందరికీ కంటి పరీక్షలు పూర్తి వరకు ఈ వైద్య శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుందని ముఖ్యంగా కార్యాలయంలో డ్రైవర్, క్లినర్స్, అటేండర్స్, క్లాస్-4 సిబ్బందికి మొదట పరీక్షలు జరిపిన తర్వాత మీగతా కార్యాలయ అధికారులు చేసుకోవాలన్నారు. కార్వాలయ శాఖల వారిగా అందరు పరీక్షలు చేయుంచుకునేలా ఆయా శాఖల అధికారులు చుసుకోవాలన్నారు. కలెక్టరేట్ సిబ్బంది అందరికీ పరీక్షలు జరిపే వరకు శిబిరాన్ని నడపాలని వైద్యాధికారికి తెలిపారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కంటి వెలుగు శిబిరాన్ని పర్యవేక్షించారు. కలెక్టరేట్ సిబ్బంది ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా పరీక్షలు జరిపాలని వైద్యాధికారి కి తెలిపారు.
కలెక్టర్ వెంట జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. సాయికిరణ్, డిఆర్డీఏ గోపాల్ రావు, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్ జిల్లా అధికారులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
issued by Dist Public Relations Officer Siddipet District