బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పరకాల నియోజకవర్గం లో నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

రేపటి తరానికి స్ఫూర్తి నింపడానికి తెలంగాణా ప్రభుత్వం జూన్ 2 నుండి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని, తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, అధికారులు ,ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఉత్సాహంగా పనిచేయుటకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి అన్నారు.

బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పరకాల నియోజకవర్గం లో నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల లో తెలంగాణలోని వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధిని తెలుపుతూ ప్రతి శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిపై ప్రజలకు వివరించాలని, చర్చ జరిపి ప్రణాళిక బద్ధంగా 21 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పరకాల లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలనీ తెలిపారు. రాష్ట్ర ప్రభుథ్వ నేతృత్వం లో వివిధ రంగాలకు సంబంధించిన అభివ్రుధిని ముందుకు తీసుకెళ్లేందుకు వారి సలహాలు, సూచనల ప్రకారం సమావేశాలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ప్రతి రంగానికి సంబంధించిన ప్రగతి ప్రజలకు చేరువైన తర్వాత ఎలా ఉందనేది ప్రజలతో మాట్లాడించాలని , రాష్ట్రం లో ఎక్కువ మంది ప్రజలకు ముడి పడిన అంశం వ్యవసాయ మని,జూన్ 3 న జరిగే వ్యవసాయ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలనీ కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక తో ప్రతి మండలం ,ప్రతి గ్రామంలో ప్రజా ప్రతి నిదులతో సమావేశాలు జరిపి, రైతు వేదికలో కార్యక్రమ్మాన్ని నిర్వహించేందుకు పక్క ప్లాన్ తో ముందుకు వెళ్ళాలని అన్నారు. అడగడుగన స్ఫూర్తి ప్రదర్శింప బడాలంటే మొదటి రోజు రైతు దినోత్సవం నాడు రైతు సమీకరణ జరగాలి, డప్పులు, వాయి ద్యాల తో ఎడ్ల బండ్ల పై ర్యాలి గా వెళ్లి జాతీయ గీతం తో కార్యక్రామాన్ని మొదలు పెట్టి రైతులకు అర్థమయ్యే టట్లు రాష్ట్ర ప్రభుత్వ సందేశం ఉండాలని, రైతులను మాట్లాడించాలని. ఏ రంగంలోనైనా ప్రగతి పూర్వం ఎలా ఉంది తెలంగాణ వచ్చాక ఎలా ఉంది అనే అంశాలపై మాట్లాడాలన్నారు. అన్ని శాఖలు వారి శాఖ అభివృద్ధి గురించి ఉత్సవాలలో వివరించాలన్నారు. ముఖ్యమైన వ్యవసాయ శాఖను మొదటి రోజు పెట్టడం వల్ల ప్రజలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. రైతు వేదికలను అందంగా అలంకరించి వ్యవసాయ శాఖ సాధించిన ప్రగతిని రైతులకు వివరించాలని తెలిపారు. వెయ్యి మంది రైతులు హాజరయ్యే ల చూడాలని రైతులతో సహపంక్తి భోజనాలు పెట్టాలన్నారు. రైతు బీమా తీసుకున్న రైతుల కుటుంబాలతో వారి అనుభవాలను వారి తోనే మాట్లాడించాలన్నారు. అలాగే చెరువుల దగ్గర సంబరాలు నిర్వహించాలన్నారు. బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి మత్స్యకారులు చెరువుల దగ్గర కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి ఉత్సవాలు జరుపుకోవాలని అక్కడే వేయి మందికి భోజన వసతి కల్పించాలన్నారు. అలాగే ప్ర‌గ‌తి ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా… గ్రామాల్లో, జిల్లాల్లో ర్యాలీలు, మాన‌వ హారాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. విద్యార్థులు, మ‌హిళా సంఘాలు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇందులో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని మంత్రి చెప్పారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఆవిర్భ‌వించింది. వారి త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ అమ‌ర వీరుల స్థూపాలున్న చోట‌.. వాటికి, లేని చొట కొత్త‌గా ఏర్పాటు చేసి, అమ‌ర వీరుల‌కు ఘనంగా నివాళుల‌ర్పించాల‌ని తెలిపారు. తెలంగాణ‌కు ముందు, త‌ర్వాత జ‌రిగిన అభివృద్ధిపై నివేదిక‌లు సిద్ధం చేయాల‌ని, గ‌తంలో ప‌ల్లెలు ఎట్లుండే… ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా,ఉండాలని అధికారుల‌కు తెలిపారు.

అధికారులు ఆయా శాఖ‌ల వారీగా సమ‌న్వ‌యంతో ప‌ని చేయాలి. అంతా క‌లిసిక‌ట్టుగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాలి. అని తెలిపారు. వివిధ వ‌ర్గాల వారీగా, వృత్తుల వారీగా, స‌మాజంలోని ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాముల‌ను చేస్తూ, ఆయా కార్య‌క్ర‌మాల ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు స‌భ్యులు, పంచాయ‌తీ వివిధ అభివృద్ధి క‌మిటీలు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాలి. ఏ రోజు ఏం చేయాలి? ఎలా చేయాల‌నే దానిపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సిద్ధం చేయాలి. ఆయా అంశాల‌ను గ్రామ స్థాయిలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరేలా చేయండి అని అధికారుల‌ను దిశానిర్దేశం చేశారు.

సీపీ రంగనాధ్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్బంగా పోలీస్ శాఖ తరపున అన్నీ కార్యక్రమలకు పోలీస్ బందోబస్త్ చేస్తాము అని అన్నారు. ఈ ప‌దేండ్ల‌లో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాల‌ను ప్ర‌జ‌లు తెలిపేలా ప్ర‌దర్శ‌న‌లు జ‌ర‌గాల‌ని తెలిపారు

కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంతం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల rdo రాము ,pd drda శ్రీనివాస్ కుమార్, cpo సత్యనారాయణ రెడ్డి,, విద్యా, వైద్య, ఆరోగ్య, మున్సిపల్,వ్యవసాయ, విద్యుత్,పరిశ్రమిక రెవిన్యూ. సంక్షేమ జిల్లా ఉన్నత అధికారులు , పలువురు ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.

Share This Post