బుధవారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మాన్సాన్ పల్లెలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వివిధ అభివృద్ది పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ జి.రంజిత రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

బుధవారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం నియోజకవర్గం మాన్సాన్ పల్లెలో పల్లె ప్రగతి కార్యక్రమంలో
పాల్గొని వివిధ అభివృద్ది పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,
గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ జి.రంజిత రెడ్డి,
జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో
కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి, హరిత హరంలో భాగంగా
మొక్కలు నాటి, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం పనులను మంత్రులు
పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో పాల్గొని డ్వాక్రా
మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు లింకేజ్ కింద మంజూరైన 40 కోట్ల రూపాయల
చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా మహిళలు తమ
విజయవంతమైన ప్రయాణాలను వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా స్త్రీ నిధి ద్వారా మహిళలకు 20 లక్షల వరకు
నిధులు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని అన్నారు. మహిళలకు స్వయం శక్తి
పెరిగి, గౌరవం పెరిగిందని, ఈ రోజు 48 కోట్లు మహిళా సంఘాలకు బ్యాంక్
లింకేజ్ ద్వారా అందిస్తున్నాం తెలిపారు.  మహిళలు వ్యాపార పరంగా బాగా
ఎదగాలని, మార్కెటింగ్ ను పెంచే విధంగా పేదరిక నిర్మూలన సంస్థ పని చేయాలని
తెలిపారు. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, మహిళలకు ఉచితంగా కుట్టు
మిషన్ ను ఇప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. మహిళలు బాగు పడితేనే ఆ
కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని అన్నారు. ఈ రోజు రుణాలు
పొందుతున్న మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, స్త్రీ నిధి ద్వారా మహిళలు
ఆర్థికంగా బాగా ఎదుగుతున్నారు.   మహిళా గ్రూప్స్ కి 20 లక్షల వరకు
ఇవ్వాలని సీఎం కెసిఆర్ చెప్పారని అన్నారు. మంచి ఆదాయ మార్గాలను
అన్వేషించి, వ్యాపారాలు చేసి మహిళలు బాగా ఎదుగుతున్నారని తెలిపారు.
ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాలను అవగాహన చేసుకుంటే, అభివృద్ధి చెందడం
కష్టమేమీ కాదని మంత్రి అన్నారు. మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ ఆంగ్ల
మాధ్యమ పాఠశాలల్లో చేర్పించి చదివించాలి అని అన్నారు.
గ్రామాల్లో ఇప్పుడు వైద్య పరంగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర
ప్రభుత్వమే మందులు ఉచితంగా ఇస్తున్నదని అన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా
మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను మెరుగు
చేశామని తెలిపారు.
ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున హాజరైన మహిళా లోకానికి
శుభాకాంక్షలు తెలిపారు.  నిరుపేద నిర్మూలన కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా
వెనుకాడటం లేదని, మీరు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా
ఉందని తెలిపారు. మనం ఎదగాలంటే శిక్షణ, క్రమశిక్షణ అవసరం అన్నారు. 590
కోట్ల నిధులు స్త్రీ నిధి ద్వారా ఇచ్చి, మహిళలు స్వయం శక్తిని సంపాదించి,
కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా చేసేలా కృషి
చేయడం జరుగుతున్నదని. తెలిపారు.
జెడ్పీ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళల స్వయం
అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. 8 ఏళ్లుగా
పెద్ద ఎత్తున గ్రూప్ కి 20 లక్షల వరకు నిధులను స్వయం సంఘాలకు
అందిస్తున్నందున, పురుషులకు దీటుగా మహిళలు ఎదగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్
ప్రతీక్ జైన్, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత
అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post