హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా ప్రతి గ్రామంలో 10 ఎకరాల న్ధలంలో తలపెట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం కార్యక్రమాన్ని నంబంధిత శాఖల అధికారులు నక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లాలోని మందమర్రి మండలం అందుగులపేట, బొక్కలగుట్ట గ్రామపంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేసి పారిశుద్ధ్య పనులతో పాటు బృహత్ పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవివ్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణంతో నహజ వాయువు అందించడంలో భాగంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందని, బృహత్ పల్లెప్రకృతి వనం కార్యక్రమాన్ని ఇదే స్ఫూర్తితో చేపట్టాలని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీనుకోవాలని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించేలా చూడాలని నంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలలోని నివాసాలతో
పాటు పరినర ప్రాంతాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా ప్రతి నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీనుకోవాలని, మురుగు కాలువలలో పూడిక లేకుండా ఎప్పటికప్పుడు శుభపర్బాలని అధికారులకు నూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మందమర్రి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి.
ప్రవీణ్ కుమార్, మండల పంచాయతీ అధికారి షేక్ సష్టర్ అలీ, గ్రామ సర్చంచ్ ఏనుగు తిరుపతి రెడ్డి, వైస్ఎంపిపి లౌడం రాజ్‌కుమార్, నంబంధిత శాఖల అధికారులు, గ్రామ నభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.