బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

      జగిత్యాల, అగస్టు 09: భవిష్యత్ అవసరాలకనుగునంగా మండల కేంద్రాలలో 10 ఎకరాల విస్థీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐఏంఏ హాలులో జిల్లా అధికారులతో కన్వర్జేన్సి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేసిన నర్సరీలకు తరలించాలని, ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన నర్సీల పేమెంట్ లకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని సూచించారు. చివరిదశలో ఉన్న వైకుంఠదామాల నిర్మాణాలను పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు ప్రగతి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ప్రతిరోజు సానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని, మురుగు కాలులలో పెరిగిన మొక్కలను, పిచ్చిమొక్కలను తొలగించాలని, రోడ్లపై నీరు నిలువ లేకుండా చూడాలని, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న చెరువులు, కుంటలు 834 లకు డి మార్టికేషన్ చేసి బౌండరీలు ఫిక్స్ చేసి (మార్క్ఔట్) హద్దులు చేసి బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈనెల 11న జరుగనున్న జవహర్ నవోదయ ప్రవేశపరీక్షలకు నాన్ టీచింగ్ సిబ్బందిని స్టాఫ్ ఇన్సులేటర్లుగా నియమించాలని, నాయిబ్ తహసీల్దార్లను సిట్టింగ్ స్వాడ్లుగా విధులను కేటాయించి, ఎటువంటి మాస్ కాపియింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. అన్నిశాఖల ఈ ఆఫీస్ లో ఫైళ్ల పెండింగ్ ఉండకుండా వెంటవెంటనే పరిష్కరించాలని, వివిధ సమస్యలతో వచ్చే దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ఉపకార వేతనాన పంపిణిలో అలస్యం జరగరాదని, హరితహారంలో ఇంకా అదనంగా నాటాల్సిన మొక్కలను వెంటనే నాటేలా చూడాలని, పైపులైను కోరకు రోడ్లును ద్వసంచేయరాదని, పనులకు అలస్యంగా మంజూరు లబించినట్లయితె వాటి పునరద్దరణ పనులను కూడా చేపట్టాలని పేర్కోన్నారు. పనులకు సంబంధించి అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని పేర్కోన్నారు.

ఈ కార్యక్రమలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల అర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post