బృహత్ పల్లెప్రకృతి వనాలలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన

తేదిః 21-09-2021
బృహత్ పల్లెప్రకృతి వనాలలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 21: ప్రతి మండలంలో 10 ఎకరాల్లో చేపట్టనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలలో వెదురు మొక్కలతో బయోఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం మేడిపల్లి, కోరుట్ల మండలాల్లోని పలు గ్రామాలలో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పనులను మరియు ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. మెడిపల్లి మండలం వెంకట్రావు పేట గ్రామంలో, కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో బృహత్ పల్లెప్రకృతివనం కొరకు కేటాయించిన స్థలాలను పరిశీలించి వనంలో ఒకే విధమై మొక్కలను కాకుండా అటవి శాఖ అధికారుల సూచనలను పాటించి వివిధ రకాల మొక్కలను నాటాలని, ప్రకృతి వనాలలో ఒకే విధమైన మొక్కలను కాకుండా వివిధ రకాలైన అటవి సంబంధమొక్కలను నాటాలని సూచించారు. లక్ష్యం మేర మొక్కలను నాటడం మాత్రమే కాదని, నాటిన మొక్కలు అభివృద్ది చెందేలా చూసినప్పడు శతశాతం విజయం సాదిస్తామని పేర్కోన్నారు. ప్రకృతి వనాలలో అందరు ఒకే విధమైన లేదా పూల మొక్కలకు ప్రాదాన్యం ఇస్తూ, ఎక్కువ స్థలాన్ని వృదా చేస్తున్నారని, ఆ విధంగా కాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారమె ఎక్కవ మొక్కలను నాటేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం మెడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామపంచాయితి భవనంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, ప్రజల్లో వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, ఇంటిటి సర్వే నిర్వహించాలని, ప్రజల్లో వ్యాక్సిన్ పై నెలకొన్న బయాందోళనలను నివృత్తిచేస్తు వారికి అవగాహనను కల్పించాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించి, వ్యాక్సిన్ కొరకు వచ్చిన పలువురిని పలకరిస్తూ వ్యాక్సిన్ అనంతరం పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేసి, వ్యాక్సిన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.అనంతరం మేడిపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించి ఇంటింటి సర్వే నిర్వహించి సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్ వారిని అభినందించి, రికార్డులను తన ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, కోరుట్ల ఆర్డీఓ టి. వినోద్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post