బృహత్ ‘పల్లె ప్రకృతి’ , అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాల్సిన పెండింగ్ లను వారంలోగా లక్ష్యాలను పూర్తిచేయ్యాలి – జిల్లా కలెక్టర్ కే. శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్22 సెప్టెంబర్2021.

*బృహత్ ‘పల్లె ప్రకృతి’ , అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాల్సిన పెండింగ్ లను వారంలోగా లక్ష్యాలను పూర్తిచేయ్యాలని జిల్లా కలెక్టర్ శేశoకా అధికారులను ఆదేశించారు*

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో పల్లె ప్రకృతి, బృహత్ పల్లేప్రకృతి వనాలు, ఎన్ ఆర్ ఈ జీ ఎస్ పనులు అట్టి పేమెంట్స్, హరితహారం లో నాటిన మొక్కలు నష్టపోయిన మొక్కల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తి దశల్లో పనులు పూర్తి చేయాలని,వాటిని వారంలోగా ప్రారంభించాలని,సిమెంట్ బెంచిలు ఏర్పాటు చేయాలని, ప్లాంటేషన్, గేటు, వాకింగ్ ట్రాక్, లేఅవుట్ ప్రారంభంలో ఉండాలని, బయో పెన్సింగ్,2, 3 వరుసలు చేయ్యాలని, మల్టీ లేయర్ ను కూడా ఉపయోగించాలని దీనిలో 30% కూడా పూర్తి కాలేదని, ముళ్లతో కూడిన మొక్కలు పెట్టాలని, ఎఫ్ ఆర్ ఓ లతో మాట్లాడి మొక్కల సమస్య లేకుండా చూసుకోవాలని, పెండింగ్ లను పూర్తిచేయాలని, జూన్ లోనే ఎన్ని అవసరమైన మొక్కలను నిర్ణహించుకొని ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని , ఇప్పుడు మొక్కలు లేవు అంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా ఎన్ హెచ్ , ఎస్ హెచ్, ఆర్ & బి రోడ్ల కు ప్రాధాన్యత ఇవ్వాలని, సింగిల్ లేయర్ ను పూర్తీ చెయ్యాలని, ప్రతి గ్రామ పంచాయితీ లో సుమారు 3 కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని 461 గ్రామపంచాయతీ లో తప్పక అనుసరించాలని, ప్రతి మండల హెడ్క్వార్టర్ నుండి దేశం రోడ్ల కు ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కలను లాసైన మొక్కలను రికార్డ్ చేసుకోవాలని, పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.
ఎన్ ఆర్ ఈ జీ ఎస్ లో రాష్ట్రంలో జిల్లా 27 వ స్థానంలో ఉందని, ఎం పీ వోలు, ఎం పీ డీ వోలు, ఏం చేస్తున్నట్లు అని, మీ పర్యవేక్షణ క్షేత్ర స్థాయిలో ఉండాలని, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ,ఉపాధి హామీ కూలీలకు లేబర్ బడ్జెట్ లో నిర్లక్ష్యం చేయకూడదని, 15 రోజుల్లో కూలీల మొత్తం డబ్బులను చెల్లించాలని, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు రాణి వారి జాబ్ కార్డులను తొలగించాలని అన్నారు. జిల్లాలో తొర్రూరు మండలం వెనుకంజలో ఉందని, అధికారుల తీరుమార్చుకోవాలని, పంచాయతీ సెక్రటరీలకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదని, రోజువారీగా టెలీ కాన్ఫరెన్స్ లో సానిటేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని, మిషన్ భగీరథ AE లతో సమీక్షించి 10 రోజులకోసారి వాటర్ ట్యాంక్ లను కడిగించాలని, సీజన్ లో వచ్చే వాటికి GP నిధులను ఆమోదం తో ఖర్చు పెట్టాలని అన్నారు.సంక్షేమ అభివృద్ధి పనులను మాధ్యమాలలో ప్రసారం చేయాలని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు తెలియజేస్తూ ఈ నెల 30 తేదీ లోపు జిల్లాలో ప్రతిఒక్కరికి 1స్ట్ డోస్ పూర్తి చేయాలని అన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ కు బోర్డ్ లు పెట్టాలని అన్నారు
———————————-
జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది*

Share This Post