బృహత్ పల్లె ప్రకృతి వనంలో మియావాకి విధానంలో మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల చుట్టూ గ్రీన్ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠ ధామాలను వారం రోజుల వ్యవధిలో పూర్తిచేయాలని కోరారు. కంపోస్టు షెడ్ల్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఏపీడి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post