బృహత్ పల్లె ప్రకృతి వనంలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పత్రికా ప్రకటన
బృహత్ పల్లె ప్రకృతి వనంలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
తిప్పర్తి, మాడుగుల పల్లి,వేముల పల్లి,సెప్టెంబర్,13. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి,పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాం త్ జీవన్ పాటిల్ ఆదేశించారు.
సోమవారం నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూర్,మాడుగుల పల్లి మండలం మాడుగుల పల్లి జి.పి.,వేముల పల్లి మండలం సల్కనూర్ గ్రామ పంచాయతీల్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాలను జిల్లా కలెక్టర్ సందర్శించి పనుల పురోగతి ని పరిశీలించి అధికారులతో చర్చించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలం కు ఒకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ లో 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGS), గ్రామీణ అభివృద్ధి (Rural Development) ద్వారా రూ.40 లక్షల వరకు నిధులు సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ఒక యూనిట్ కు 31 వేల మొక్కలు నాటడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ,పంచాయతీ శాఖల అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటి బృహత్ పల్లె ప్రకృతి వనాలను సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

తిప్పర్తి మండలం పజ్జూర్ గ్రామపంచాయతీ లో బృహత్ పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షేడ్ ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు..జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బృహత్ పల్లె ప్రకృతి వనం లో నాటిన మొక్కలు పరిశీలించి, 31 వేల మొక్కలు నాటాలని,ఇప్పటి వరకు 25 వేల మొక్కలు నాటడం జరిగిందని,మిగతా 6 వేల మొక్కలు నాటాలని,డంప్ యార్డ్,కంపోస్ట్ షెడ్ చుట్టూ మొక్కలు నాటి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పనులు వారం రోజుల్లో సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

మాడుగుల పల్లి మండలం మాడుగుల పల్లి గ్రామపంచాయతీ లో బృహత్ పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించి పనులు పురోగతి పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం లో నాటిన మొక్కలు పరిశీలించి, 31 వేల మొక్కలు నాటాలని,ఇప్పటి వరకు 28 వేల మొక్కలు నాటడం జరిగిందని,మిగతా 3 వేల మొక్కలు నాటాలని,గేట్,చుట్టూ సిమెంట్ దిమ్మెలకు గ్రీన్ కలర్ వేయాలని పనులు వారం రోజుల్లో సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వేముల పల్లి మండలం సల్కనూర్ లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాట్లు పనులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఫెన్సింగ్ ఏర్పాటు పూర్తి చేసి నట్లు అధికారులు వివరించారు.గేట్ ఏర్పాటు చేయాలని,బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటెందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని,మొక్కలు నాటడం,ఇతరత్రా పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, ఎం.పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.


Share This Post