బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచండి:: జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ,నవంబర్ 15. బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు.
సోమవారం జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో జరుగుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు పనులు జరిగే తీరును అధికారులను అడిగి తెలుసుకుని పనుల్లో వేగాన్ని పెంచి త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్ధుల్ హమీద్, డిఆర్డిఓ.జి.రాంరెడ్డి, ఏపిఓ, తదితులున్నారు.

Share This Post