బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

కేసముద్రం (మహబూబాబాద్ జిల్లా) ఆగస్ట్-10:

పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే బృహత్ పల్లె ప్రకృతి వనం త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం కేసముద్రం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండలంలో ప్రభుత్వ భూముల్లో, అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం ఇప్పటివరకు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలను తెలుసుకొని పంచాయతీ రాజ్ శాఖ, అటవీశాఖ అధికారులు సమిష్టిగా వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. హద్దులు ఏర్పాటు చేయాలని, వెంటనే వాటికి నెంబర్స్ కేటాయించాలని, జామాయిల్, తాటి ఈతల ను తీసి వేయకూడదని, రోడ్డు మార్గం నిర్మాణం చేయాలని, పది ఎకరాల స్థలంలో సుమారుగా 31 వేల నుండి 32 వేల వరకు మొక్కలు పెట్టవచ్చునని కలెక్టర్ తెలిపారు. నిర్దేశించిన మొక్కలను, వాటి పరిమాణాలను చూసుకోవాలని, మండలంలో వివిధ దశల్లో ఉన్నటువంటి వైకుంఠదామాల  పనులను పూర్తిస్థాయిలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి. సుధాకర్ , ఫారెస్ట్ రేంజ్ అధికారిణి  ఆశాలత దాస్, ఎంపీడీవో రాజారాణి, తహసిల్దార్ కోమలి, బీట్ ఆఫీసర్ రాములు, జెడ్.పి.టి.సి. శ్రీనాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎనమల ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి ఉప్పలయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post