బృహత్ పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదిక పనులపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
30 37 2021
వనపర్తి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో బృహత్ పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం రైతు వేదిక తదితర పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాలు సేకరించిన స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి ఏర్పాటు చేసి గులమోహర్ ,నిమ్ తదితర మొక్కలు నాటాలని అన్నారు. మంగళవారం వరకు రైతు వేదికల దగ్గర మొక్కలు నాటి రిపోర్టు అందజేయాలన్నారు. 2014 నుండి మున్సిపల్ పరిధిలో 10 శాతం లేఅవుట్ భూములను అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ పరిధిలో ఎల్ఆర్ఎస్ కు 47, 724 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వైకుంఠధామం కాంపౌండ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. మదనాపురం లో మొక్కలు నాటడం అందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, జడ్పి సిఇఓ వెంకట్ రెడ్డి, డిపిఓ సురేష్ కుమార్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,ఈఈ లు ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..

……………

జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post