బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలి.

ప్రచురణార్ధం

బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణ పటిష్టంగా చేపట్టాలి.

మహబూబాబాద్, సెప్టెంబర్,30.

బృహత్ పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ అధికారులు పటిష్టం గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలపై ఎంపిడిఓలు పాల్గొని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.

జిల్లాలో 16 మండలాలలో 10 ఎకరాలకు ఒకటి చొప్పున 16 బృహత్ పల్లె ప్రకృతి వనాలు చేపట్టగా నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బృహత్ పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ పటిష్టంగా చేపట్టాలన్నారు.

నీటి సౌకర్యాలు ప్రధానమని, తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని బోరు వేసుకోవాలన్నారు. మొక్కకు కావసిన నీటిని వృధాకాకుండా నేరుగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

బృహత్ పల్లె ప్రకృతి వనానికి ఉపాధిహామీ పథకం కింద స్ట్రేంచ్ కొట్టించడం మొక్కలకు గచ్ఛకాయ, వెదురు మొక్కలను ఫెన్సింగ్ కు నాటాలన్నారు. నిర్వహణకు వాచర్ ను నియమించాలన్నారు. క్షేత్రాధికారులు మొక్కలు ఎదిగే వరకు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, కొమరయ్య, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జడ్పి సి.ఈ.ఓ. రమాదేవి, డి.ఆర్.డి.ఏ.పీడీ సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post