బృహత్ పల్లె ప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అంతరించిపోతున్న చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూ, ఆయా ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున నేరడిగొండ మండలం వడూర్ గ్రామం లోని వైడుర్యాపురం ఖిల్లాలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె పకృతివనం ను అదనపు కలెక్టర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వడూర్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం లోని ఖిల్లా పైకి కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజుల కాలం నాటి భూములను ప్రభుత్వ అధీనంలో ఉండే విధంగా బౌండరీ లను ఏర్పాటు చేయాలనీ తహసీల్దార్ ను ఆదేశించారు. ప్రకృతి వనంలో అటవీ జాతి పెద్దమొక్కలు, పండ్ల మొక్కలను పెంచాలని, పంచాయితీకి ఆదాయం సమకూర్చే విధంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.పశువులు, మేకలు తినకుండా కంచె ఏర్పాటు చేయాలన్నారు. చారిత్రక కట్టడలలో పచ్చదనం సంతరించుకునేవిధంగా ఏర్పాటు చేసి, సుందరంగా తీర్చి దిద్ది, పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఉపాధి హామీ పనుల క్రింద పనులు చేపట్టాలని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. రాజుల కాలం నాటి భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. దసరా పండుగ వేళా ఖిల్లా పై పూజ కార్యక్రమ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, సీసీ రోడ్డు మంజూరు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అబ్దుల్ సమద్, సర్పంచ్ గాదె సమత, ఎంపీపీ రాథోడ్ సృజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అర్.భోజన్న, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post