బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలను యోగ్యమైన స్థలాలుగా చేసి త్వరితగతిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

 

ప్రచురణార్ధం

జనవరి,05 ఖమ్మం:

బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలను యోగ్యమైన స్థలాలుగా చేసి త్వరితగతిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దా రుపల్లి బృహత్పల్లె ప్రకృతి వనం ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. ఇప్పటికే ఎంపిక చేసిన ప్రభుత్వ స్థలంలో గుట్టలు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసి, మొక్కలు నాటేందుకు అనువుగా ఉండే విధంగా సమగ్ర ప్రణాళికతో పనులు చేపట్టాలని, మైనింగ్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణ సక్రమంగా ఉండాలని, ఫెన్సింగ్, నీటి వసతి ఏర్పాట్లు చేయాలని సూచించారు. హరితహారం కింద ప్రధాన రహదారితో పాటు, అంతర్గత రహదారుల వెంట ఎవన్యూ ప్లాంటేషన్ జరగ లేదని ఇట్టి నిర్లక్ష్యానికి, జాప్యానికి బాధ్యులైన మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కొరకు కనీసం 8 అడుగుల మొక్కలను నాటాలని, వాటికి సంరక్షణ వలయాలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీ ద్వారా నీటి సదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో, ఎవెన్యూ ప్లాంటేషన్లో మండల గ్రామ స్థాయి అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై బాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు. తెల్దా రుపల్లి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంకనూ చదును చేయాల్సిన గుట్ట ప్రాంతాన్ని మైనింగ్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా గుట్ట చదును చేసేపనులు చేపట్టి బృహత్ పల్లె ప్రకృతి వనం పూర్తి స్థాయిలో ఏర్పాటు అయ్యే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, మైనింగ్ శాఖ ఏ.డి సంజయ్ కుమార్, ఇంచార్జ్ తహాశీల్దారు కరుణశ్రీ, ఎం.పి.డి.ఓ. శ్రీనివాసరావు, సర్పంచ్ కోటయ్య, ఎం.పి.టి.సి మంగతాయారు, ఎం.పి.పి ఉమ, గ్రామ కార్యదర్శి రాధ, ఎం.పి.ఓ. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post