బృహత్ పల్లె ప్రకృతి వనాలలో ఈ నెల 24న పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.

పత్రికా ప్రకటన                                           మహబూబ్ నగర్
23 .7 .2021
____________
బృహత్ పల్లె ప్రకృతి వనాలలో ఈ నెల 24న పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు.
జిల్లాలో ఈ నెల 24 న హరిత హారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్న దృష్ట్యా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వీరన్న పేట సమీపంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం తో పాటు, నాటేందుకు తీసుకువచ్చిన మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఆరు ఫీట్ల పైబడి ఉండటం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక వీరన్న పేట నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వరకు ఉన్న బిటి రహదారికి ఇరువైపుల మొక్కలు నాటేందుకు చేపట్టిన గుంతలు తవ్వే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు కు దగ్గరగా కాకుండా నిర్దేశించిన దూరంలో మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. మొక్కలు నాటడం తో పాటు, సంరక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
వీరన్న పేట ప్రాంతంలో బృహత్ పల్లె ప్రకృతి వనం చేపట్టేందుకు ఎంపిక చేసిన స్థలం చాలా బాగుందని కలెక్టర్ అన్నారు.ఒక వైపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మరో వైపు విద్య సంస్థలు,బృహత్ పల్లె ప్రకృతి వనంతో భవిష్యత్తులో వీరన్న పేట ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అన్నారు .
జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ,మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకరాచారి తదితరులు ఉన్నారు.
____________

జారీ చేసినారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ ,మహబూబ్ నగర్

Share This Post