బెస్ట్ అవలేబుల్ స్కూల్ ప్రవేశానికి లక్కీ డ్రా.

పత్రిక ప్రకటన
తేది 28.07.2021

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2021.22 విద్యా సంవత్సరం లో బెస్ట్ అవలేబుల్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం అదనపు పాలనాధికారి పి. రాంబాబు తన ఛాంబర్ లో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డ్రా తీయడం జరిగినది.
ఇందులో 5వ తరగతి లో 58 మంది దరఖాస్తులు చేసుకోగా 19 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందని, మొదటి తరగతి లో 19 మంది దరఖాస్తు చేసుకోగా ,19 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి వి. రాజేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

 

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post