బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక పూర్తి – అదనపు కలెక్టర్ మను చౌదరి
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 8 బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1వ. తరగతి, 5వ. తరగతులలో ప్రవేశానికి బుధవారం నాగర్ కర్నూలు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనం లో అదనపు కలెక్టర్ మను చౌదరి లక్కీ డిప్ ద్వారా సీట్లను ఎంపిక చేశారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివేందుకు 1 తరగతికి 78 మంది దరఖాస్తు చేసుకోగా 37 సీట్లకుగాను 37 మంది విద్యార్థులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
5వ తరగతిలో 178 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 36 సీట్లకు గాను 36 మంది విద్యార్థులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా లక్కీ డిప్ ద్వారా నిర్వహించడం జరిగిందని, సీటు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని ఆశాభావంతో ముందడుగు వేయాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ మను చౌదరి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి రామ్ లాల్ , ఇతర అధికారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.