బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాల కొరకు లక్కీ డిప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.          తేది:06.06.2022, వనపర్తి.

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 2022-23 సం.నకు గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాల కొరకు లక్కీ డిప్ పద్దతి ద్వారా ఎంపిక చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీ డిప్ ఎంపిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ద్వారా 3వ, 5వ, 8వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకము ద్వారా పాఠశాలలో ప్రవేశానికి అర్హత పొందుతారని ఆమె తెలిపారు.
వనపర్తి జిల్లాలో (79) మంది గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, (10) సీట్లు భర్తీ చేయుటకు అనుమతి ఉన్నట్లు ఆమె తెలిపారు. 3వ తరగతిలో 32  మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 6 మంది ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. 5వ తరగతిలో 39 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇద్దరిని ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. 8వ తరగతిలో 8 మంది దరఖాస్తు చేసుకోగా, ఇద్దరిని ఎంపిక చేయటం జరిగిందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, డీఈవో రవీందర్, ఎ.ఓ. ఆర్.దిలీప్ కుమార్, సెక్షన్ క్లర్క్ ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post