బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా ……

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా ……

ప్రచురణార్ధం

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా ……

మహబూబాబాద్, జూన్ -08:

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో ఒకటవ, ఐదవ తరగతిలో ప్రవేశాలకు డ్రా తీయడం జరిగిందని అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో 1వ తరగతి నందు (18) సీట్ల కొరకు, ఐదవ తరగతి లో (18) సీట్ల కొరకు డ్రా తీసి జిల్లాలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు అలాట్ చేయడం జరిగిందని తెలిపారు. ఒకటవ తరగతి కొరకు మహబూబాబాద్ లోని ఎస్.వి. విద్యాలయం, గాదే రుక్మారెడ్డి హై స్కూల్, డోర్నకల్ లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్ నందు, ఐదవ తరగతి ప్రవేశం కొరకు మహబూబాబాద్ లోని ట్వింకిల్ స్టార్ హై స్కూల్ కు విద్యార్ధిని, విద్యార్ధుల తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాలను అలాట్ మెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకటవ తరగతిలో ఐదుగురు విద్యార్ధులు, ఐదవ తరగతిలో ఒక విద్యార్ధి ని వెయిటింగ్ లిస్ట్ నందు పెట్టడం జరిగిందని తెలిపారు.

డ్రాలో ఎంపికైన విద్యార్ధులకు సోషల్ స్టేటస్ వెరిఫిఫికేషన్ చేసి అలాట్మెంట్ ఆర్దర్స్ ఇచ్చి, పాఠశాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్. డి.ఓ. ఆర్. సన్యాసయ్య, కార్యాలయ సిబ్బంది, విద్యార్ధుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post