*బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానం*
– *జూన్ 4 వ తేదీ*
*దరఖాస్తుల సమర్పణకు తుది గడువు*
– *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
——————————
2022-23 విద్యా సంవత్సరమునకు గానూ బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ( రెసిడెన్షియల్ ) పథకములో భాగంగా ఉత్తమ పాఠశాలను ఎంపిక చేయడానికి , జిల్లాలోని ప్రైవేటు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలకు విద్యార్థులను ( విద్యార్థుల ఆప్షను ప్రకారము ) ప్రతి సంవత్సరము కేటాయిస్తామని తెలిపారు.
ఇందుకు గాను బెస్ట్ అవెలబుల్ స్కూల్స్ ( రెసిడెన్షియల్ ) పథకములోని విద్యార్థులకు ట్యూషన్ , హాస్టల్ వసతి , భోజన వసతికి గాను ప్రతి విద్యార్థికి సంవత్సరమునకు రూ .30,000 / – చొప్పున చెల్లించనున్నట్లు చెప్పారు.
ధరఖాస్తు ఫారములకు కరీంనగర్ జిల్లాషెడ్యుల్డ్ తెగల అభివృద్ధి శాఖ గారి కార్యాలయములో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఔత్సాహిక ప్రైవేట్ పాటశాల యాజమాన్యాలు దరఖాస్తులను వచ్చే నెల తేది 04-06-2022 లోపు సమర్పించవలసి ఉంటుందన్నారు.
ఇట్టి అవకాశమును రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రైవేటు పాఠశాలలు సద్వినియోగము చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రకటనలో కోరారు.
——————————