బేసిక్స్ తగ్గకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా అధికారులతో పాఠశాలలు నిర్వహణ, మధ్యాహ్న భోజన సదుపాయాలు, • యాస్పిరేషనల్ నివేదికలు సమర్పణ, పింఛన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తుల విచారణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి వల్ల దాదాపు 16 నెలల పైబడి పాఠశాలలు నిర్వహణకు అవకాశం లేకుండా పోయిందని,  ఇన్నాళ్లు పాఠశాలలు నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యనభ్యసించుటలో కాస్త వెనుకంజలో ఉన్నారని ప్రత్యేక బోధనతో విద్యార్థులను  సన్నద్ధం చేయాలని ఆయన సూచించారు. ఉపాద్యాయులు విద్యార్థులను కొడుతున్నారని ఇటువంటి

సంస్కృతి  విద్యావ్యవస్థకు మంచిది కాదని ఇటువంటి చర్యలకు పాల్పడే ఉపాద్యాయులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని డిఈఓ ను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించాలని చెప్పారు. పించన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ నిర్వహించి మంజూరుకు  సిఫారసు చేయాలని సూచించారు.  పించన్లు మంజూరుకు వచ్చిన దరఖాస్తులను విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని ఆయన సూచించారు. మంగళవారం యాస్పిరేషన్ కార్యక్రమాలపై నిర్వహించనున్న సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని చెప్పారు. ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అంగన్వాడీ భవనాలను తక్షణమే అంగన్వాడీ అధికారులకు అప్పగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. టెలి మెడిసిన్ సేవలు నిర్వహణ కొరకు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. టెలి మెడిసిన్ సేవలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు స్లాట్స్ బుక్ చేసిన ప్రకారం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. రేబిస్ వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కుక్కల వ్యాప్తిని తగ్గించేందుకు కుని ఆపరేషన్లు నిర్వహణకు నిర్మిస్తున్న భవన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని చెప్పారు. చుంచుపల్లి గ్రామ పంచాయతి పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయినప్పటికి రాత్రి వేళల్లో  వీధి లైట్లు వేయక పోవడం  వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చుంచుపల్లి గ్రామపంచాయతి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని డిపిఓకు సూచించారు. టిజిటల్ తరగతులు నిర్వహణకు ఎంపిక చేసిన 100 తరగతి గదులకు పరికరాలు ఏర్పాటు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని, మన జిల్లాను హరిత జిల్లాగా తయారు చేయుటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్గత రహదారుల్లో మొక్కలు నాటే కార్యక్రమంపై బాగా ఫోకస్ చేయాలని సూచించారు. అన్ని గ్రామ, మున్సిపాల్టీలలో వైకుంఠ దామాల నిర్మాణాలు పూర్తయినందున అంతిమ కార్యక్రమాలు వైకుంఠదామాల్లోనే నిర్వహించు విధంగా చర్యలు చేపట్టాలని యంపిడిఓ, యంపిఓలను ఆదేశించారు. ప్రతి మండలంలో వైకుంఠ రధం ఏర్పాటుకు దాతల నుండి విరాళాలు స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు. అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షంతో పాటు వరదలు వల్ల ముంపు పొంచి ఉన్నదని అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ అశోకచక్రవర్తి, డిఈఓ సోమశేఖర శర్మ, డిపిఓ రమాకాంత్, వైద్యాధి కారులు డాక్టర్ శిరీష, ముక్కంటేశ్వరావు, పశుసంవర్ధక అధికారి పురందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post