బోధవ్యాధి పై అవగాహన పరచాలి… జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ప్రచురణార్థం

బోధవ్యాధి పై అవగాహన పరచాలి…

దంతాలపల్లి.
మహబూబాబాద్ జూలై 16.

బోధవ్యాధి కార్యక్రమంలో మాత్రలు పంపిణీ చేస్తూ ఈ వ్యాధిపై అవగాహన పరచాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ అన్నారు.

శుక్రవారం దంతాలపల్లి మండల కేంద్రంలో బోధవ్యాధి మాత్రల పంపిణీ కార్యక్రమం తీరును స్వయంగా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు.

బోధవ్యాధి మాత్రల పంపిణీ పై కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ ప్రాంతంలో బోధవ్యాధి వ్యాప్తి చెందు తున్నందున ముందస్తుగా వ్యాధి రాకుండా అడ్డుకునేందుకు మాత్రలు ప్రతి ఒక్కరు మింగాలి అన్నారు. అలాగే పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ బోధ వ్యాధి మాత్రలు మింగే విధంగా చర్యలు తీసుకున్నారు.

బోధ వ్యాధిగ్రస్తులతో కలెక్టర్ మాట్లాడారు వైద్యాధికారులు ఆదేశిస్తూ బోధవ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటేనే మాత్రలు మింగేందుకు ముందుకు వస్తారన్నారు.
అదేవిధంగా నులి పురుగుల నిర్మూలన కు మాత్రల పంపిణీ జరుగుతున్నదని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

పాఠశాలలు నిర్వహించక పోవడం వలన వైద్య అంగన్వాడి సిబ్బంది ఇంటింటికీ తిరిగి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటూ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.

పంపిణీ చేసిన ప్రతి ఇంటి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు వైద్యాధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హరీష్ రాజు జిల్లా నోడల్ అధికారి రాజేష్ మహిళా శిశు సంక్షేమ అధికారి సబిత ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి వైద్య అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post